ఎన్టీఆర్ కు మెగాస్టార్ ఫోన్…త్వ‌రగా కోలుకోవాలంటూ ఎమోష‌న‌ల్ ..!

  • Written By: Last Updated:
ఎన్టీఆర్ కు మెగాస్టార్ ఫోన్…త్వ‌రగా కోలుకోవాలంటూ ఎమోష‌న‌ల్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని చిరు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారన్టైన్ లో ఉన్నారు. తారక్ మరియు ఆయన కుటుంబ సభ్యులు బాగున్నారు. తను చాలా ఎనర్జిటిక్ గా ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను.

త్వరలోనే కొలుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ హీరో హెల్త్ గురించి తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తారలు కరోనా మహమ్మారి బలయ్యారు.

follow us