మీడియా తో వీరయ్య ముచ్చట్లు చెప్పబోతున్న చిరు – రవితేజ

చిరంజీవి – రవితేజ లు కలిసి మీడియా ముందుకు రాబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటీకే దేవి శ్రీ అందించిన సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేస్తున్నారు.
ప్రమోషన్ లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిరంజీవి మరియు రవితేజ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు , సినిమా విశేషాలు చెప్పబోతున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో వచ్చే నెల నాల్గవ తారీఖున ఘనంగా జరపబోతున్నారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కోసం రాష్ట్రం నలుమూలల నుండి ప్రత్యేక రైళ్లు కూడా నడపబోతున్నారట. అలాగే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నారని..ఇందుకోసం మూవీ టీం ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.