ఈ వయసులో రిస్క్ అవసరమా..అంటే చిరు సమాధానం ఇదే

ఈ వయసులో రిస్క్ అవసరమా..అంటే చిరు సమాధానం ఇదే

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య వచ్చే నెల 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం చిత్ర ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు చిరంజీవితో పాటు మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు బాబీ, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాదానాలు తెలిపారు. వాటిలో ఈ వయసులో వీరయ్య సినిమాలో 8 డిగ్రీల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? వర్షంలో తడస్తూ సీన్స్ చేయాలా?’’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి చిరంజీవి ‘‘కచ్చితంగా ఉంది. లేని రోజున బెటర్ రిటైర్.. ఇంటికెళ్లిపో. ఈ మాట ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చెప్తాను’’ అని సమాధానం ఇచ్చారు.

పరిస్థితులు ఎలా ఉన్నా.. నువ్వు కమిట్ అయినప్పుడు.. పాత్రకి న్యాయం చేయాలని నువ్వు అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందుల్ని నువ్వు ఇబ్బందిగా ఫీలవకూడదు. ఒకవేళ అయినా వాటిని కనబడనీయకూడదు. వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసినప్పుడే ఈ ఫీల్డ్‌లో ఉండేందుకు నీకు అర్హత ఉంటుంది. లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు. ఒక యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను. స్టార్ డమ్ ఊరికే రాదు రిస్క్ చెయ్యాలి అని మీరే అంటారు. వేషాలపై ఆకలితో ఉండాలి. ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయినప్పుడు ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు’’ అని చిరంజీవి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

follow us