చరణ్ ను ఆన్ ఫాలో చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగిసిన తర్వాత “ఖైదీ నెంబర్ 150” తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తనయుడు రామ్ చరణ్ ఓవైపు తండ్రి సినిమాలు నిర్మిస్తూ, హీరోగా రానిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి ట్విటర్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మెగా అభిమానులు మొత్తం మెగాస్టార్ ను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. ట్విటర్ ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వచ్చాడు. కరోనా టైమ్ లో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని మస్క్స్ , సానిటైజర్స్ వాడాలని ప్రతి ఒక్క విషయం తన ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ వచ్చాడు. నిత్యం సోషల్ మీడియాలో ఆక్టివ్ ఉంటూ వస్తుండటంతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ట్విటర్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత తన కొడుకు రామ్ చరణ్ ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. కానీ సడన్ గా చర్రీ ని ఆన్ ఫాలో చెయ్యడంతో మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు. చరణ్ ను కట్ చెయ్యడం వెనుక తండ్రి కొడుకుల సోషల్ మీడియాలో పోస్ట్స్ పై ఏమైన గిల్లికజ్జాలు మొదలు అయ్యయా అనే విషయం తెలియాలిసి ఉంది. లేకపోతే తనకు తాను చాలు .. ఇకపై ఎవరిని ఫాలో కానవసరం లేదు అనుకున్నాడా ఏమోగాని చరణ్ ఆన్ ఫాలో చెయ్యడం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.