స్నేహితురాలి కోసం చిరు మూవీ…

స్నేహితురాలి కోసం చిరు మూవీ…

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాల స్పీడ్ పెంచాడు. కెరియర్ మొదట్లో ఎలాగైతే వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను , అభిమానులను అలరింప చేసాడో..ఇప్పుడు తన వయసు ను సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేసిన వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో చేస్తున్న భోళా శంకర్ మూవీ కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో మరో ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటె తన స్నేహితురాలు రాధికా బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాధిక మరియు చిరంజీవి సుదీర్ఘ కాల ఆప్త మిత్రులు. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇద్దరి కాంబో అప్పట్లో హిట్ కాంబినేషన్. అలాంటి హిట్ కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ కాబోతుంది. కాకపోతే ఈసారి రాధిక మరియు చిరంజీవి జోడీగా కాకుండా… చిరంజీవి హీరోగా రాధిక నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. రాధిక సొంత బ్యానర్ రాడాన్ బ్యానర్ లో చిరంజీవి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని..అన్ని కుదిరితే సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

follow us