కరోనా ఎఫెక్ట్..తెలంగాణలో మళ్లీ థియేటర్‌లు బంద్..!

కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమచారం ప్రకారం వైద్యారోగ్యశాఖ రాష్ట్రంలో థియేటర్ లు మూసివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. థియేటర్లు మూసివేయాలని అది కుదరకపోతే సీటింగ్ కెపాసిటీని యాబై శాతానికి కుందించాలని ప్రతిపాధించింది. థియోటర్లలో కరోనా పెరిగే ఛాన్స్ ఉందని కాబట్టి థియేటర్ లను మూసివేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా కరోనా కేసుల వల్ల లాక్ డౌన్ విధించగా సినీ పరిశ్రమ, థియేటర్ పరిశ్రమ తీవ్ర నష్టాలను చూడాల్సివచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతుంది. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, లాంటి సినిమాలు మంచి వసూళ్లు రాబట్టడంతో సినీ పరిశ్రమ ఊపిరిపీల్చుకుంది. కానీ మళ్లీ థియేటర్ లకు తాళం పడే అవకాశం ఉండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్నసినిమాల నిర్మాతలు, హీరోలు టెన్షన్‌లో ఉన్నారు. మరో వైపు ఎప్రిల్, మే లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఆచార్య, టక్ జగదీశ్, వకీల్ సాబ్ లాంటి సినిమాలు విడుదల చేస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థంగా మారింది.