“ఛలో” దర్శకుడితో నాగశౌర్యకు విభేదాలున్నాయా.?

  • Written By: Last Updated:
“ఛలో” దర్శకుడితో నాగశౌర్యకు విభేదాలున్నాయా.?

నాగశౌర్య హీరోగా నటించిన “ఛలో’ సినిమా 2018 లో విడుదలై క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హీరోగా నాగశౌర్య కు దర్శకుడిగా వెంకీ కుడుములకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ నటించి అలరించింది. సినిమాకు వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ ప్లస్ గా నిలిచింది. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంకా ఈ సినిమా విడుదలై నేటితో మూడేళ్లు పూర్తయ్యింది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ సినిమాను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. హీరో నాగశౌర్య “ఛలో” సినిమా వచ్చి మూడేళ్లయ్యిందని..తన తల్లి సూపర్ హీరో అంటూ ఈ సినిమాను నిర్మించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే తన పోస్ట్ లో దర్శకుడు వెంకీ కుడుములను మాత్రం మెన్షన్ చేయలేదు. దాంతో నెటిజన్లు నాగశౌర్య పై మండిపడుతున్నారు. సినిమా సక్సెస్ అవ్వడానికి అసలు కారణం దర్శకుడు అని అతడిని ఎలా మరిచిపోతావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరి కొందరు నెటిజన్లు ఇద్దరి నాగశౌర్య వెంకీ కుడుముల మధ్య విభేదాలున్నాయని అందుకే నాగశౌర్య తన పోస్ట్ లో వెంకీ కుడుములను మెన్షన్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు వెంకీ కుడుముల సైతం తన పోస్ట్ లో నాగశౌర్య ను మెన్షన్ చేయలేదు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే అనుమానం వస్తుంది.

follow us