అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా సునీల్ !!

  • Written By: Last Updated:
అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా సునీల్ !!

అల్లు అర్జున్ నటించిన అల వైకుంటపురం చిత్రం ఈ ఏడాది మంచి విజయం సాదించింది. ప్రస్తుతం పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లా నేరేడుమిల్లి అడవిలో షూటింగ్ జరుపుకుంటుంది.

పుష్ప చిత్రం గురుంచి తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది మంది విలన్ లు నటిస్తున్నారు. అందులో రావు రమేశ్, ముఖేష్ రుషి, సునీల్ ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మిగతా విలన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నది. కామిడీ యాక్టర్ గా సినిమాలు మొదలు పెట్టిన సునీల్. ఆ మధ్య కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తరువాత వరస ఫ్లాప్స్ రావడం వలన కమెడియన్ గా, విలన్ గా నటిస్తున్నాడు.

రవి తేజ నటించిన డిస్కో రాజ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ మధ్య ఓటీటీ లో విడుదలైన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు. తనకు ఎప్పటినుండో ప్రతి నాయకుడి పాత్రలో నటించాలని కోరికని పలు సందర్భలో చెప్పాడు. తాజా సమాచారం మేరకు సునీల్ ని పుష్ప లో వన్ ఆఫ్ ది విలన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో మెయిన్ విలన్ కోసం సుకుమార్ పలువురి స్టార్స్ ని సంప్రదిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప లో పుష్పా రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇంకో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి అల్లు అర్జున్ ప్రయాణం కానున్నాడు.

follow us