తెలంగాణ రాజకీయం అంతా కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూనే

Congress MP Revanth Reddy arrested in Drone camera case
Congress MP Revanth Reddy arrested in Drone camera case

తెలంగాణ ప్రజా ప్రతినిది కుటుంబానికి ఫార్మ్ హౌస్ అంటే చాలా ఇష్టం.. ఎవరికి మాత్రం ఫార్మ్ హౌస్ అంటే ఇష్టం ఉండదు.. కానీ తెలంగాణ ముఖ్య మంత్రి ఆయన కుమారుడి ఫార్మ్ హౌస్ మాత్రం ప్రతిపక్ష పార్టీలకు ఒక అస్త్రం ..

మొన్నటి వరకు ఎర్ర‌వల్లిలోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రం అంటే.. ఇప్పుడు ఆయన  కుమారుడు కేటీర్ ఫార్మ్ హౌస్.. కేటీర్ ఎక్కువగా ఫార్మ్ హౌస్ లో ఉంటారు.. అక్కడ ఏం చేస్తుంటారు అసలు ఏం అవ్వుతుంది లోపల అని ఎవరు పెద్ధ గా ఆలోచించలేదు.. కానీ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అరెస్ట్ తో ఇదో పెద్ధ ఇష్యూ గా మారింది..

రేవంత్ రెడ్డి ఫార్మ్ హౌస్ గురించి మాట్లాడాడు కాబట్టే ఆయనను అరెస్ట్ చేయించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అప్పటి వరకు ఏ  ఇష్యూ రాలేదు.. రేవంత్ మాట్లాడిన వెంటనే బాల్క సుమన్ ప్రెస్ మీట్.. రేవంత్ ఢిల్లీ నుంచి వెనకకి రాగానే డ్రోన్ వాడారు అంటూ అరెస్ట్.. ఎందుకు కేటీర్ కు అంత భయం ఆ గెస్ట్ హౌస్ విషయం లో.. నిజంగానే నిబంధనలకు విరుద్ధం గా కట్టారా లేక ఇంకా ఏమైనా ఉందా అనే అనుమానాలను ప్ర‌జ‌ల్లో పెంచేట్టుగా ఆయ‌నే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒక  డ్రోన్ కెమెరా వాడినందుకు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఒక ఎంపీ ని అరెస్ట్ చేసే అంత రాజకీయ ఎత్తుగడ ఎందుకు.. రేవంత్ రెడ్డి  చేసిన పని సమర్ధించదగినది కాదు అయిన ఎయిర్ పోర్ట్ కి వెళ్లి అరెస్ట్ చేసే అంత పెద్ధ పని కాదు..

కేటీర్ ఫార్మ్ హౌస్ గురించి ఎవరు మాట్లాడిన  కేసు తప్పదా అనే ఆలోచన ప్రజలలోకి బలంగా పోతుంది….