విశాఖ : గాజువాక లో చికెన్ వ్యాపారికి కరోనా 

విశాఖపట్నం లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తుంది.. గాజువాక లో చికెన్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.. ఆయన కు టెస్ట్ నిర్వహించిన అధికారులు హోమ్ ఖ్వారంటైన్ లో ఉండమని ఇంటికి పంపించేశారు. ఆ సదరు వ్యాపారి ఎప్పటి లనే ఈ ఆదివారం కూడా చికెన్ వ్యాపారం చేసి మొత్తం 24 మందికి చికెన్ అమ్మినట్టు గా గుర్తించారు.. దానితో వాళ్ళని కూడా ఐసొలేషన్ కు పంపారు అధికారులు.. కానీ కొంత మంది ఇంకా ట్రేస్  చేయాల్సి కాలేదు. 
లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసిన అధికారులు వారిని ఐసోలేషన్ లో ఉంచడం లేదు .. టెస్ట్ కి తీసుకున్నాక హోమ్ క్వారంటైన్ అని ఇంటికి  పంపిచాక కనీసం ఆ వ్యక్తి ఇంట్లో ఉండకుండా వ్యాపారం చేయడం తో అధికారుల నిర్లక్ష్యం తెలుస్తుంది.. 
ఇప్పుడు ఈ చికెన్  వ్యాపారి వల్ల ఇంకా ఎంత మందికి కరోనా సోకిందో చూడాలి.