షాకింగ్.. కన్నీటి చుక్కల్లోనూ కరోనా వైరస్…!

చైనాలో పుట్టిన కరోనా వైరస్.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది.. కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్‌ను కూడా కుదిపివేసే స్థాయికి చేరాయి… చైనా ప్రభుత్వం కోవిడ్ 19 వైరస్ నియంత్రణకు చేపడుతోన్న చర్యలు కొంత సఫలం అవుతున్నా.. మరోవైపు ఇతర దేశాల్లో ఈ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా వైరస్ విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి… ఎలాంటి వైరస్ అయినా ఊపిరితిత్తులతో వ్యాప్తి చెందుతుంది… దీంతో, మాస్క్‌లు ధరించి నివారణ చర్యలు చేపడతారు.. కోవిడ్‌ 19 మాత్రం క‌న్నీటి చుక్కల్లోనూ క‌నిపిస్తోంద‌ట‌.. చైనాలోని జీజియాంగ్ వ‌ర్సిటీకి చెందిన ఓ పరిశోధనలో ఇది తేలింది. కరోనా వైర‌స్ సోకిన పేషెంట్లపై.. వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించారు.. తాజాగా ఆ నివేదకను విడుదల చేశారు.. క‌న్నీటి చుక్కల‌తో పాటు కండ్ల నుంచి వ‌చ్చే ఇత‌ర ద్రవాల్లోనూ క‌రోనా వైర‌స్ ఉంటుందని ఆ పరిశోధన తేల్చింది. ఈ పరిశోధన కోసం.. కోవిడ్‌19 వ్యాధి సోకిన సుమారు 30 మంది రోగుల‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు.. రోగుల‌ క‌న్నీటి చుక్కలు, కండ్లక‌ల‌కల్లోనూ వైర‌స్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. కేవ‌లం ఊపిరితిత్తుల‌కే కాకుండా, ఇత‌ర శ‌రీర భాగాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేవలం మాస్క్‌లు మాత్రమే ధరిస్తే సరిపోదు.. కంటి అద్దాలను సైతం ధరించాల్సిన ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. మాన‌వ శ‌రీరం నుంచి బయటకు వచ్చే క‌రోనా వైర‌స్‌.. ఏవైనా వ‌స్తువుల‌పై సుమారు రెండు నుంచి ఐదు రోజుల వ‌ర‌కు బతికే ఉంటుందట… దీంతో, ఇది వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. చివరకు చైనా కరెన్సీని సైతం మార్చిన సంగతి తెలిసిందే.