కోవిడ్ పరీక్షా ఎలా చేస్తారు , ఎలా చేయించుకోవాలి  ? 

కరోనా వైరస్ పరీక్షాలు ఎక్కడ చేయించుకోవాలి , ఎలా చేయించుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇదిగోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్..

కోవిడ్ పరీక్షా ఎక్కడ ఎలా చేస్తారు : 

కరోనా వైరస్ పరీక్షా రక్త నమూనాలతో చేయరు. మీ గొంతు , నాసికాలను  పరీక్షిస్తారు.. అలానే మీ గొంతులోనుంచి శాంపిల్ తీసుకొని .. స్వబ్ టెస్ట్ కోసం నోడల్  ఆసుపత్రికి పంపిస్తారు.. పరీక్షా  ఫలితాలు వచ్చే వరకు మీరు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేదు.. మీ ఆరోగ్య పరిస్థితి మేర మిమ్మల్ని  ఆసుపత్రి లో చేరుస్తారు లేకపోతే మీరు మీ ఇంటి లోనే ఐసొలేషన్ లో ఉండవచ్చు.. పాజిటివ్ వస్తే  కనీసం 14 రోజులు ఐసొలేషన్ లో ఉండాలి.. లేదా పూర్తిగా తగ్గేంత వరకు.. 

కరోనా పరీక్షా చేయించుకోవాలి అంటే : 

కరోనా వైరస్ పరీక్షా చేయించుకోవాలంటే మీరు 24/7 పని చేసే కాల్ సెంటర్ నెంబర్ : 01123978046 కు ఫోన్ చేయండి లేక పోతే [email protected] కు మెయిల్ చేయండి.. జిల్లా లోని అధికారులు మీ వద్దకు వచ్చి మీకు పరీక్షలు నిర్వహిస్తారు.. మీకు కరోనా లక్షణాలు ఎక్కువగాఉంటే మిమ్మల్ని ప్రత్యకంగా ఏర్పాటు చేసిన అంబులెన్సు లో ఆసుపత్రి కి తరలిస్తారు.. ప్రభుత్వ ఆసుపత్రి లో  మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతాయి .. 

మీకు కరోనా లక్షణాలు ఉన్న.. లేక పోతే మీకు కోవిడ్ సోకినది అన్న అనుమానం ఉన్న దయచేసి ఆసుపత్రి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక మీ సొంత వాహనాలు వాడకండి..