కరోనా వచ్చినా భార్యను వదలని వృద్ధుడు..

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది… ఆ వైరస్ వచ్చిందంటే చాలు… బాధితులు వారి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సిందే.. లేకపోతే వారు కూడా ఆ మాయదారి వైరస్ బారినపడడం ఖాయం. అయితే, ఓ 87 వృద్ధుడు మాత్రం… తాను కట్టుకున్న భార్యను వదిలి ఉండలేకపోయాడు… వైరస్ సోకిన తన భార్యకు తానే అన్నీ చూసుకుంటున్నాడు… ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వృద్ధుడు.. కరోనా వైరస్ సోకిన తన భార్యకు తనే స్వయంగా ఆహారం తినిపిస్తున్నాడు.. బాధితురాలి దగ్గరకు వెళ్లొద్దని వైద్యులు వారించినా.. వినిపించుకోకుండా.. తనకూ ఆ వైరస్ వచ్చినా పర్వాలేదంటూ… తన భార్య దగ్గరే ఉంటూ ఆమెకు సపర్యలు చేసాడు ఆ వృద్ధుడు. మాయదారి రోగాన్ని సైతం లెక్కచేయకుండా… తమ బంధానికి ఎంతో విలువ ఇచ్చి… తన భార్యను చూసుకున్నాడు.. అయితే, ఆ వృద్ధుడికి కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కానీ, తన భార్య పట్ల ఆ పెద్దాయన చూపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది…