కరోనా ఎఫెక్ట్.. అప్రమత్తమైన టీటీడీ

ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రమైన తిరుమల ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా దేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది , అందులో భాగంగా భక్తులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా ముప్పు భక్తుల దరి చేరకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాధి భక్తులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి.. రసాయనాలను స్ప్రే చేశారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో సైతం స్ప్రే చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.