ఆఫీసులకు రమ్మంటున్నారు సరే.. మరి భోజనం ఎక్కడ చెయ్యాలి ?

కరోనా వైరస్ లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఆఫీసులకు వెళ్ళవచ్చని చెప్పింది.. కానీ పనులకు వెళ్లే వాళ్లకు భోజనం ఎలా ? 

హోటల్స్ లేవు.. పోనీ దొరికింది తిందాం అనుకున్న రోడ్ల మీద బండ్లు లేవు.. ఎంత మందికి ఆఫీసుకు వెళ్లే అప్పుడు వంట చేసుకొని భోజనం తీసుకు వెళ్లడం కుదురుతుంది.. 

మీడియా వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉంది.. మీడియా సడలింపులలో భాగం కాదు కాబట్టి అందరూ ఆఫీసులకు రావాల్సిందే.. క్యాబ్స్ లేవు.. సొంత బండ్లలోనే వెళ్ళాలి.. సొంత బండ్లు లేని వాళ్ళకి కష్టం పోనీ ఆఫీస్ కి వెళ్లకుండా ఉందాం అనుకుంటే ఉద్యోగం తీసేస్తారు ఏమో ఇదే సాకుగా చెప్పి అని ఇంకో భయం.

పోలీసుల పరిస్థితి అంతే.. హోటల్స్ లేక పోవడంతో భోజనం కు చాలా ఇబ్బంది పడుతున్నారు.. 

మీడియా, పోలీసులు ఒకే ప్లేస్ లో ఉండరు.. తిరుగుతూ ఉంటారు.. వాళ్ళకి భోజన సదుపాయం కల్పించడం లో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి అనే చెప్పాలి.. 
వీళ్ళని పట్టించుకునే నాధుడే లేడా .. ఎందుకు ఎవరికి మీడియా గుర్తు రావడం లేదు.. పని చేసే చోట కూడా భోజన సదుపాయం కల్పించడం లేదు.. అలా అని పని తక్కువ చేయించుకోవడం లేదు.. ఇవి అన్ని కాకా కరోనా సాకు చెప్పి జీతాలలో కోత.. ఇంకా మాట్లాడితే ఉద్యోగాలలో కోతలు.. 

ఇలా ఉంది కరోనా కాలంలో మీడియా ఉద్యోగుల పరిస్థితి.