భారత్ లో 114 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో 114 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్ దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఓ వైపు కేంద్ర  ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 107గా ఉండగా.. తాజాగా కేంద్రం ప్రకటించిన విరాల ప్రకారం అది 114కు చేరింది. అంటే, నిన్నటి నుంచి అదనంగా మరో ఏడు పాజిటివ్ కేసులు పెరిగాయి.

ఇక రాష్ట్రాల వారిగా చుస్తే ..

మహారాష్ట్రలో ఈ సంఖ్య 32గా ఉండా.. కేరళలో 23, ఉత్తరప్రదేశ్‌లో 12, హర్యానాలో 14, కర్ణాటకలో 6, ఢిల్లీలో 7, తెలంగాణలో 3, లడఖ్‌లో 4, జమ్మూ కాశ్మీర్ లో 3, ఆంధ్ర ప్రదేశ్ 1 కేసులు, ఒడిశాలో 1, పంజాబ్‌లో 1, రాజస్థాన్‌లో 2, తమిళనాడులో 1, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులే, ఇక, ఆస్పత్రుల నుంచి ఇప్పటి వరకు 13 డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మృతి చెందారు.

Tags

follow us