మ‌ళ్లీ యాభైశాతం సీటింగ్… టాలీవుడ్ కు షాక్ త‌ప్ప‌దా..?

  • Written By: Last Updated:
మ‌ళ్లీ యాభైశాతం సీటింగ్… టాలీవుడ్ కు షాక్ త‌ప్ప‌దా..?

క‌రోనా కారణంగా గ‌తేడాది సినీ ఇండ‌స్ట్రీ త్రీవ్రంగా న‌ష్ట‌పోయింది. దాదాపు తొమ్మిది నెలల పాటు థియేట‌ర్లు మూత‌ప‌డే ఉన్నాయి. దాంతో థియేట‌ర్ల వ్యాపారం కూడా తీవ్ర‌న‌ష్టాల‌ను చూడాల్సి వ‌చ్చింది. అయితే క‌రోనా కేసుల సంఖ్య‌త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా థియేట‌ర్‌లలో సినిమాలు విడుద‌ల‌వ‌డం మొద‌ల‌యింది. ఇక థియేట‌ర్ ల రీ ఓపెన్ త‌ర‌వాత విడుద‌లైన క్రాక్‌, ఉప్పెన‌, జాతిర‌త్నాలు సినిమాలు ఘ‌న విజ‌యాలు సాధించ‌డం..మంచి క‌లెక్ష‌న్ లు రావ‌డంతో ఇండ‌స్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డుతున్న బిజినెస్ కు మ‌ళ్లీ క‌రోనా టెన్ష‌న్ మొద‌లైంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతోంది. మ‌హ‌రాష్ట్ర‌, త‌మిళ నాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుతోంది.

దాంతో వివిధ రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్ డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే క‌ర్నాటక ప్ర‌భుత్వం 50 శాతం సీటింగ్ కు కుదిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా మ‌ళ్లి సీటింగ్ ను కుందించే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ లాక్ డౌన్ మొద‌లైతే మ‌ళ్లీ టాలీవుడ్ కు తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చిలో రంగ్‌దే, అరణ్య, తెల్లవారితే గురువారం వంటి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో సీటీమార్, వైల్డ్ డాగ్, వకీల్ సాబ్, లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక మేలో మెగాస్టార్ ఆచార్య విడుద‌ల కానుంది. ఇలాంటి స‌మ‌యంలో సీటింగ్ ను కుదిస్తే టాలివుడ్ పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందో ఇండ‌స్ట్రీ క‌ల‌వ‌ర‌ప‌డుతోంది.

follow us