పవన్ మూవీకి నో చెప్పిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..పవన్ కళ్యాణ్ చిత్రానికి నో చెప్పాడట. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ తో తెలుగు లో పరిచమయ్యాడు అనిరుద్. ఈ మూవీ పెద్దగా విజయం సాదించకపోవడం తో అనిరుద్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే తెలుగు కన్నా తమిళ్ లో వరుస మ్యూజికల్ హిట్స్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే ఛాన్స్ వస్తే నో చెప్పాడట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాని పాన్ ఇండియా లెవెల్లో ‘RRR’ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ముంబై హైదరాబాద్ నేపథ్యంలో సాగే అత్యంత పవర్ ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీని ఈ మూవీని సుజీత్ తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీని ప్రకటిస్తూ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని అనిరుద్ దగ్గర తెలుపగా..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉండడం తో పవన్ సినిమాకు నో చెప్పాడట. దీంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ వేటలో మేకర్స్ ఉన్నారట.