బ‌న్నీ ఎమోష‌నల్ పోస్ట్ పై స్పందించిన క్రికెట‌ర్.. !

  • Written By: Last Updated:
బ‌న్నీ ఎమోష‌నల్ పోస్ట్ పై స్పందించిన క్రికెట‌ర్.. !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌రోనా నుండి కోలుకున్న త‌ర‌వాత మళ్లీ ప‌దిహేనురోజుల‌కు ఫ్యామిలీని క‌లిసారు. 15 రోజుల త‌ర‌వాత బ‌న్నీ త‌న పిల్ల‌ల‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న ఎంతో ఎమోష‌నల్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా తీసిన వీడియోను బ‌న్నీ పోస్ట్ చేయ‌గా నెట్టింట వైర‌ల్ అయింది. వీడియోలో అల్లు అర్జున్ మొద‌ట అయాన్ ను చూసి కంట‌త‌డి పెట్టుకుంటూ హ‌త్తుకున్నారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత ఆర్హ ను హ‌గ్ చేసుకుని ఎమోష‌నల్ అయ్యారు. కాగా ఈ వీడియోపై భార‌త క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించారు.

బ్యూటిఫుల్ అంటూ సూర్య‌కుమార్ యాదవ్ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా బ‌న్నీ పాట‌ల‌కు ఇప్ప‌టికే ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ పెద్ద అభిమాని అనే సంగ‌తి తెలిసిందే. టిక్ టాక్ లో బుట్ట‌బొమ్మ పాట‌కు వార్న‌ర్ వేసిన స్టెప్పుల‌తో ఆ పాట క్రేజ్ ఖండాలు దాటిపోయింది. ఇక ఇప్పుడు భార‌త క్రికెట‌ర్ సూర్య కుమార్ యాదవ్ రిప్లై తో అత‌డు కూడా బ‌న్నీని ఫాలో అవుతార‌ని..బ‌న్నీ అభిమానని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వాయిదా ప‌డింది.

follow us