జాని మాస్టర్ పవన్ కళ్యాణ్ ను మెప్పిస్తాడ ?

జాని మాస్టర్ పవన్ కళ్యాణ్ ను మెప్పిస్తాడ ?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “జనసేన” పార్టీని స్థాపించి రాజకీయాల్లో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నాడు. పార్టీని ఆర్థికంగా బలోపేతం చెయ్యడానికి ఆయన ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ రాకతో అభిమానులు ఆనందానికి అవదులు లేకుండా పోయింది. బాలీవుడ్ “పింక్” చిత్రాన్ని వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రలో తెలుగులో “వకీల్ సాబ్” పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తరువాత పవర్ స్టార్ చేతిలో అధికారికంగా మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు క్రిష్ తో పిరియాడికల్ నేపథ్యం కలిగిన ఓ చిత్రం. గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో మరో సినిమా చెయ్యాలిసి ఉంది. అలాగే మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ ను తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండానే ఇంకో రెండు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో రాకేష్ మాస్టర్ జెనరేషన్ తర్వాత శేకర్ మాస్టర్, జాని మాస్టర్, బాబా మాస్టర్ ల టైమ్ నడుస్తుంది. మెగా ఫ్యామిలి నుండి వచ్చిన సినిమాల పాటలకు ఎక్కువ కాలం కొరియోగ్రాఫర్ గా పనిచేసింది జాని మాస్టర్. మెగా ఫ్యామిలి కి వీరాభిమాని. మెగా ఫ్యామిలి కి కూడా ఇతను అంటే చాలా ఇష్టం. ఆ చనువుతోనే పవన్ ను కలిసి కథను వినిపించినట్లుగా ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయి లో స్క్రిప్ట్ ను వినిపించమని చెప్పినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి స్క్రిప్ట్ ను పూర్తి చేసి పవన్ ను మెప్పిస్తాడ లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలియనున్నది.

follow us