దర్బార్ సినిమా అడ్డుకునేందుకు కోర్ట్ లో పిటిషన్

  • Written By: Last Updated:
దర్బార్ సినిమా అడ్డుకునేందుకు కోర్ట్ లో పిటిషన్

రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా జనవరి  9 న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది.. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా లైకా ప్రొడక్షన్స్ కి ఒక తల నొప్పి వచ్చి పడింది.. రజినీకాంత్ లైకా కాంబినేషన్ లో వచ్చిన సినిమా 2. 0 ఈ సినిమా కి సంబందించిన అప్పు ఇంకా తీర్చలేదు అని మలేషియా కి చెందిన డీఎంవై సంస్థ  కోర్ట్ లో కేసు వేసింది.. ఈ సంస్థ భారతీయ చిత్రాలను మలేషియా లో విడుదల చేస్తుంది.. సైరా , విశ్వాసం కూడా మలేషియా లో ఈ  సంస్థ విడుదల చేసింది..

2. 0 సమయం లో వీళ్ళు తీసుకున్న 12 కోట్లు ఇప్పుడు 23 కోట్ల 70 లక్షలు అయ్యింది ఆ మొత్తం చెల్లించాలి అని కోర్ట్ లో వేసిన కేసును విచారించిన జస్టిస్ గోవిందరాజు జనవరి 2 లోగా లైకాఈ విషయం పై స్పందించాలని నోటీసులు ఇచ్చారు..

follow us