దర్బార్ : ఒక సదా సీదా దొంగ పోలీస్ కథ 

దర్బార్ : ఒక సదా సీదా దొంగ పోలీస్ కథ 

Cine Chit Chat Rating 2.75/5

రజినీకాంత్ సినిమా అంటే మనం రజనీకాంత్ ఫ్యాన్ లనే ఆలోచించాలి.. అప్పుడే మనకి ఆ సినిమాలోని కిక్కు అర్ధం అవ్వుతుంది.. 

రజినీకాంత్ రెండు దశాబ్దాల తరువాత పోలీస్ గా కనిపిస్తున్న సినిమా దర్బార్.. మురుగదాస్ దర్శకత్వం వహించారు.. ఒక కనికరం లేని పోలీస్ ఆఫీసర్.. చట్టం లో కానీ పనులు కోసం న్యాయం కోసం పోరాటం చేసే ఒక పోలీస్ ఆఫీసర్ కథ..

మురుగదాస్ సినిమా లో ఎప్పుడు ఉండేవే జిమ్మిక్కులు అవి బాగానే ఉన్నాయి, ప్రతి దర్శకుడు చేసేదే.. రజనీకాంత్ ని ఎలేవేటే చేయడం అది బాగా వచ్చింది.. ఇంకా రైల్వే స్టేషన్ ఫైట్ అయితే రజని ఫ్యాన్స్ కి మాస్ మస్తీనే.. 

రజినీకాంత్ కూతురు గా నివేత థామస్ నటించారు.. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా చాలా బాగా వచ్చింది.. 

రజినీకాంత్ ఇంకా లిల్లి ( నయనతార ) మధ్య సాగే సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి.. కూతురు లల్లి కోసం లిల్లి వెంటపడే బాగుంటుంది.. 

కూతురు చనిపోయే ముందు ఒక సెల్ఫీలే వీడియో.. ఆసుపత్రిలో సన్నివేశాలు ఇలాంటివి సెకండ్ హాఫ్ లో సినిమాని తేల్చేశాయి.. కానీ చెప్పుకోడానికి కథ లేదు.. ఒక కనికరం లేని పోలీస్ ఆఫీసర్.. డ్రగ్ మాఫియా డాన్ అజయ్ మల్హోత్రా ( ప్రతీక్ బబ్బర్ ) ని చంపేస్తాడు.. ఆ పగ తీర్చుకోవడం కోసం అసలు విల్లన్ అజయ్ మల్హోత్రా తండ్రి హరి చోప్రా (సునీల్ శెట్టి ) ఇండియా కి వస్తాడు..ఇదే సినిమా . 
అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు.. డైరెక్షన్ చేయడానికి పెద్దగా కథ ఏమి లేదు.. ఎప్పుడు లనే మురుగదోస్ ఎమోషనల్ బిట్ ఈ సినిమా లో కూడా.. 

రజినీకాంత్ సినిమా కాబట్టి అది మురుగదోస్ డైరెక్షన్ లో మనం ఎప్పుడు చూసిన రజినీకాంత్ ఒక డాన్ ల కాకుండా పోలీస్ ఆఫీసర్ గా చూస్తాము.. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.. రజినీకాంత్ స్టైల్ గురించి చెప్పే అవసరమే లేదు ఇంకా.. 

CineChitChat : 2.75/5

follow us

Web Stories