బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ అయినప్పటికీ..రేవంత్ కు నిరాశే మిగిలింది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పూర్తి అయ్యింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవతారనేది కూడా ముందే తెలిసిపోయింది. రేవంతే ఈ సీజన్ విన్నర్ అని రెండు వారాలుగా అంత అనుకుంటూవచ్చారు. అదే జరిగింది. అయితే విన్నర్ అయినప్పటికీ రేవంత్ కు నిరాశే మిగిలింది. ఎందుకంటే రన్నర్ గా నిలిచినా శ్రీహన్ కు ఎక్కువ డబ్బులు వచ్చాయి.
గ్రాండ్ ఫినాలే రోజున చివర్లో బిగ్ బాస్ భారీ ట్విస్టు ఇచ్చారు. టైటిల్ పోరులో రేవంత్.. శ్రీహాన్ నిలవగా.. వారిద్దరిని గోల్డెన్ బాక్స్ తో హౌస్ లోకి వెళ్లారు నాగార్జున. ఈ సందర్భంగా వారిద్దరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో సగం తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని సూచన చేయగా.. ఇద్దరు ససేమిరా అన్నారు. అయితే.. ఆ ప్రైజ్ మనీగా ఉన్న రూ.50 లక్షల్లో రూ.30 లక్షలు ఇస్తామని.. వాటిని తీసుకోవటానికి ఓకే చెప్పినోళ్లు వెళ్లిపోవచ్చన్నా.. ఇద్దరు నో అంటే నో అనేసి విజేతగా నిలిచే ప్రయత్నం చేశారు. అప్పుడే.. బిగ్ బాస్ అదిరే ఆఫర్ ను నాగ్ బయటపెట్టారు. ఫ్రైజ్ మనీలో రూ.40 లక్షలు తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారని అడగ్గా.. శ్రీహాన్ ముందుకు రావటం.. అతగాడికి రూ.40లక్షల బాక్సు ఇచ్చేయటంతో అతగాడు రన్నరప్ గా బయటకు వెళ్లిపోయారు. దీంతో.. రేవంత్ విజేతగా నిలిచారు. కానీ.. అతగాడికి దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరెక్కడా లేని విధంగా విజేత తక్కువ మొత్తాన్ని.. రన్నరప్ గా నిలిచినోళ్లు భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవటం బిగ్ బాస్ కు మాత్రమే సాధ్యమని అంత మాట్లాడుకుంటున్నారు.