తన రియల్ స్టోరీతోనే అభిరామ్ ఎంట్రీ..శ్రీరెడ్డి ఎపిసోడ్ కూడా ..!

  • Written By: Last Updated:
తన రియల్ స్టోరీతోనే అభిరామ్ ఎంట్రీ..శ్రీరెడ్డి ఎపిసోడ్ కూడా ..!

దగ్గుబాటి వారసుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీపై కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ సినిమా అభిరామ్ నిజాజీవితానికి దగ్గరగా ఉండబోతుందట. ప్రేమ కథ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అంతే కాకుండా సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్ కూడా ఉండబోతుందట. అప్పట్లో శ్రీరెడ్డి అభిరామ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తనతో క్లోజ్ ఉన్న ఫోటోలను శ్రీరెడ్డి భయట పెట్టడం తో పెద్ద ఇష్షు అయ్యింది.

ఇక సినిమా గురించి మాట్లాడిన అభిరామ్ తన జీవితం లో ఆ ఎపిసోడ్ కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. అంతే కాకుండా తన సినిమాలో ఆ ఎపిసోడ్ గురించి కూడా ఉండబోతుందని తెలిపారు. అయితే అభిరామ్ ఎలా ట్రాప్ లో పడ్డాడు అనే నేపథ్యంలో కూడా కథ ఉండబోతున్నట్టు టాక్. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం అభిరామ్ డ్యాన్స్ తో పాటు యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. ఇక కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమాను మొదలు పెట్టనున్నారు.

follow us

Related News