రికార్డు స్థాయిలో విడుదలవుతున్న ధమాకా , 18 పేజెస్

రికార్డు స్థాయిలో విడుదలవుతున్న ధమాకా , 18 పేజెస్

రవితేజ నటించిన ధమాకా , నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీస్ రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతుంది. హిట్ , ప్లాప్ లాలతో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం ధమాకా మూవీ తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ట్రైలర్ , టీజర్స్ , స్టిల్స్ , సాంగ్స్ ఇలా ప్రతిదానితో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లే రేపు ధమాకా ను రికార్డు స్థాయి థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని నైజాంలో 228, సీడెడ్‌లో 160, ఆంధ్రాలో 280 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 670 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 70, ఓవర్సీస్‌లో 200 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 940 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇంత భారీ ఎత్తున రిలీజ్ కావడం రవితేజ కెరియర్ లోనే ఫస్ట్ టైం అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక ఈ మూవీ తో పాటు నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీ కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిఖిల్ – అనుపమ జంటగా నటించిన ఈ మూవీ ని సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేయగా బన్నీ వాసు నిర్మించారు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్నా సినిమా కావడం..ట్రైలర్ , టీజర్స్ యూత్ లో ఆసక్తి నింపడం తో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు..ఈ మూవీని నైజాంలో 135, సీడెడ్‌లో 65, ఆంధ్రాలో 185 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 385 నుంచి 400 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 845 నుంచి 850 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. మరి కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్..18 పేజెస్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

follow us