ధమాకా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే…

రవితేజ – శ్రీలీల జంటగా త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ధమాకా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది.
మొదటి రోజు ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ. 4.5 కోట్ల షేర్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు సాధించింది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.5 కోట్లు షేర్, రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా మొత్తంగా ధమాకా చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 12.20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ అందుకుందని సమాచారం. సినిమా విడుదలైన నాలుగు వారాలకు అంటే నెలకు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆహా కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.