మూడో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా జోరు మాములుగా లేదు

ఇటీవల కాలంలో టాక్ ను బట్టే సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయి. టాక్ బాగాలేదంటే మెగాస్టార్ సినిమాను సైతం చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అలాంటిది రవితేజ నటించిన ధమాకా మాత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడం తో ఇక ధమాకా పని అయిపోయినట్లే అని అంత అనుకున్నారు. కానీ రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి.
ఫస్ట్ డే రూ. 7 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టింది. సెకండ్ డే కూడా గట్టిగానే రాబట్టింది. నిన్న ఆదివారం కావడం , క్రిస్మస్ కావడం తో ప్రేక్షకులు ధమాకాను చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు. వసూళ్ల పెరగడం వెనుక రవితేజ యాక్టింగ్ , శ్రీలీల డాన్స్ , మ్యూజిక్ , కామెడీ ఇలా అన్ని వర్క్ అవుట్ అయ్యాయని , సినిమా కథ పెద్దగా లేనప్పటికీ ఇవన్నీ సెట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.