రివ్యూ : ధమకా

 • Written By: Last Updated:
రివ్యూ : ధమకా

Dhamaka Movie Review : మాస్ మహారాజా రవితేజ గతేడాది చివర్లో క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక ఎలాగైనా ఈ ఏడాదిలో ఒక హిట్ అయినా అందుకోవాలని ధమాకా సినిమాతో రెడీ అయిపోయాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.

కథ:

స్వామి(రవితేజ) ఒక మిడిల్ క్లాస్ యువకుడు. ఆనంద్ చక్రవర్తి (రవితేజ) పీపుల్ మార్ట్ అధినేత సచిన్ ఖేడేకర్ కుమారుడు. ఇద్దరు రూపాలు ఒకేలా ఉన్నా ఇద్దరు బాధ్యతలు వేరు.. నేపథ్యం వేరు.. స్వామికి చెల్లి పెళ్లి చేయాలి అనేది కల. ఆనంద్ ను తన కంపెనీకి సీఈవో చేయాలనీ తండ్రి ( సచిన్ ఖేడ్కర్) ఆశపడుతుంటాడు. కానీ, ఆనాడే కు అది నచ్చదు. ఇక స్వామి పావనిని(శ్రీలీల)ను ఇష్టపడతాడు. ఆమె తండ్రి (రావు రమేశ్) తనను ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఇదిలా ఉంటే మరోపక్క కార్పొరేట్ సంస్థ కనపడితే తన వశం చేసుకోవాలనే జెపి (జయరాం) కన్ను ఆనంద్ చక్రవర్తి సంస్థ పీపుల్ మార్ట్ పై పడుతుంది. ఇక నయానో భయానో జేపీ.. ఆనంద్ కంపెనీని వశం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. దాన్నీ ఆనంద్ తిప్పికొట్టాడా..? వీరి మధ్యలోకి మధ్యతరగతి యువకుడు స్వామి ఎందుకు వచ్చాడు..? చివరికి తండ్రి కోరికను ఆనంద్ నెరవేర్చడా..? పావని ఆ ఇద్దరిలో ఎవరిని ఇష్టపడుతుంది..? ఆనంద్ కు, స్వామికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? జయరాం ఆటను ఎవరు? ఎలా ముగిస్తారు? అన్నదే ధమాకా కథ..

మాస్ మహారాజా రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డబుల్ ధమాకా పేరుకు తగ్గట్టే రెండు పాత్రల్లో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ లో ఓల్డ్ రవితేజ కనిపిస్తాడు. ఇక శ్రీ లీల డ్యాన్స్ లు కోసం సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు. స్ర్కీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్లామర్‌ను కూడా వడ్డించి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. త్రినాథరావు నక్కిన ముందరి సినిమాలానే ఈ సినిమా కూడా ఉంది. కామెడీ, యాక్షన్ మిక్స్ చేసి కొట్టేశాడు. కొంచెం ఫస్టాఫ్ మొత్తం రవితేజ వన్ మ్యాన్ షో.. బోర్ అని ఫీల్ అయ్యేలోపు సాంగ్స్, కామెడీ సీన్స్ తో రక్తి కట్టించాడు దర్శకుడు.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా రావు రమేశ్- హైపర్ ఆది మధ్య కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. సెకండాఫ్ మొత్తం రొటీన్ గా ఉన్నా ఫోక్ సాంగ్ కొద్దిగా నిలబెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రొటీన్ కథనే అయినా బోర్ కొట్టకుండా చేయడంలో త్రినాథరావు తన ప్రతిభను చూపించాడు.

Also Read : క్లైమాక్స్‌లో సీన్లు చూసి అనుపమ కంటతడి

ఇక నటీనటుల విషయానికొస్తే.. పాత్రకు తగ్గట్టు అందరు తమతమ ప్రతిభను చూపించారు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేడేకర్, జయరామ్, రావు రమేశ్, తులసి, పవిత్రా లోకేష్, ప్రవీణ్, ఆలీ, హైపర్ ఆది లాంటి పాత ముఖాలే కాబట్టి ఎవరు ఏంటి అని తెలుసుకోవాల్సిన పని లేదు. విలన్ గా జయరామ్ కొద్దిగా అతిగా కనిపించినా కథను బట్టి ఓకే అని చెప్పొచ్చు. ఇక సాంకేతిక నిపుణులు అంటే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకొంది. జింతాక, దిండిదయాల్ సాంగ్స్ కు ప్రేక్షకులు డ్యాన్స్ లు వేయడం ఖాయం. ప్రసన్న కుమార్ డైలాగ్స్ ఓకే అనిపించాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉండడంతో సినిమా చూసే వారికి ఎక్కడా అతికించినట్టు కనిపించదు.

ఫ్లస్ పాయింట్స్

 • రవితేజ నటన
 • శ్రీలీల అందం
 • నిర్మాణ విలువలు
 • మైనస్ పాయింట్స్

 • రొటీన్ కథ
 • ముందే ఊహకు వచ్చే సీన్స్
 • ట్యాగ్ లైన్: డబుల్ ధమాకా ఒక్కసారికే

  Dhamaka Movie Review Rating : 2.5/5

  ధమకా ట్రైలర్ :

  follow us