ధమాకా రన్ టైం మరి ఇంత తక్కువ..

ధమాకా రన్ టైం మరి ఇంత తక్కువ..

హిట్ , ప్లాప్ లాలతో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం ధమాకా మూవీ తో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా రన్ టైం 130 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలకు ఈ రన్ టైమ్ ఒక విధంగా తక్కువేననే చెప్పాలి.

కొన్ని సినిమాలకు రన్ టైమ్ ప్లస్ అయితే మరికొన్ని సినిమాలకు రన్ టైమ్ మైనస్ అవుతుంది. సినిమా లెంగ్త్ మరీ తక్కువగా ఉందనే భావన కలిగినా కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడుతుందనే సంగతి తెలిసిందే. రవితేజ , శ్రీలీల జోడీపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నా సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం కచ్చితంగా మారిపోతుందని మేకర్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

follow us