ధమాకా ట్రైలర్ టాక్..

క్రాక్ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం ధమాకా మూవీ తో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా..గురువారం విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ట్రైలర్ చూసిన వారంతా రవితేజ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని ఫిక్స్ అవుతున్నారు.

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ మొత్తం 2 నిమిషాల 6 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘కోట్లల్లో ఒకడాడు.. కొడితే కోలుకోలేం’ అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో స్వామి, ఆనంద్ చక్రవర్తి వంటి రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ పోషించినట్లు తెలుస్తుంది. మరి సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడా? లేక ‘కింగ్’ టైపులో ఒక్కడే ఇద్దరు గా యాక్ట్ చేస్తున్నాడా అనేది చూడాలి.

follow us