ధనుష్ ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న విడుదల

  • Written By: Last Updated:
ధనుష్ ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న విడుదల

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉన్నది. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది 2023, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు ధనుష్ కళాశాల మెట్లమీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని ఉన్న వైనం అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం చాట్ బస్టర్స్ లో అగ్రగామిగా నిలవడంతో పాటు, చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ‘సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఆలోచింప చేస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

follow us

Web Stories