నిజంగా బాలకృష్ణ..ప్రభాస్ ను ఆ ప్రశ్నలు అడిగారా..?

నిజంగా బాలకృష్ణ..ప్రభాస్ ను ఆ ప్రశ్నలు అడిగారా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకపోతున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేసారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ జనవరి 01 న స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో ఈ షో లో ప్రభాస్ ను పలు ప్రశ్నలు అడిగారని , వాటికీ ప్రభాస్ సమాదానాలు తెలిపాడని అంటున్నారు. అవి ఏంటి అంటే..

ప్రభాస్ ఎందరో స్టార్ హీరోయిన్లతో నటించారు. గతంలో ఓ స్టార్ హీరోయిన్ ను ప్రభాస్ మగరాయుడుగా కామెంట్ చేశారనే వార్తలు వచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలో బాలకృష్ణ ప్రభాస్ ను ఆ ప్రశ్న అడిగినట్లు చెబుతున్నారు. మరోవైపు అనుష్కతో పెళ్లి అనే పుకార్లు షికార్లు చేస్తున్నందున బాలకృష్ణ ఆ ప్రశ్న కూడా అడిగారు. అంతేకాదు తన బ్లాక్ బస్టర్ సినిమా నుంచి ఆ హీరోయిన్ ను తప్పించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఆ హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ప్రభాస్ ఆమెను అలా పోల్చారనే విషయాలు అందరిలో ఇంట్రస్ట్ పెంచుతున్నాయి.

follow us