ప్రభాస్ కోసం టెన్షన్ పడుతున్న దిల్ రాజు

  • Written By: Last Updated:
ప్రభాస్ కోసం టెన్షన్ పడుతున్న దిల్ రాజు

దిల్ రాజు టాలీవుడ్ లో పేరు మోసిన బడా నిర్మాతలలో ఒకరు.. ఆయన చేతిలో ప్రస్తుతానికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తప్ప ఇంకా ఏమి పెద్ద సినిమాలు లెవ్వు .. దిల్ రాజు కి ఒక పెద్ద సినిమా తీయాలని ఉంది. పవన్ కళ్యాణ్ తో సినిమా అని అనుకున్నారు కానీ ఆ సినిమా ఇంకా మొదలు అవ్వలేదు.. అవ్వుతున్నదో లేదో కూడా తెలియని పరిస్థితి.. పవన్ ఎప్పుడు ఓకే అంటాడో .. ఎప్పుడు నో అంటాడో అన్న క్లారిటీ లేదు.


దానికే దిల్ రాజు ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యం తో సినిమా చెందామని అనుకుంటున్నారు.. ఒక మంచి దర్శకుడు కోసం వేట మొదలు అయ్యింది.. వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఇలా అందరి దర్శకుల దగ్గర కథలు విన్నారు.. దిల్ రాజు కి ప్రభాస్ ని కొత్త గా చూపించాలి అని ఉందట. దీని కోసం అయన తెగ టెన్షన్ పడిపోతున్నారు. మంచి కథ కావాలి, మంచి దర్శకుడు కావాలి, ప్రభాస్ ని కొత్తగా చూపించాలి… ఇలా ఇన్ని ఉన్నప్పుడు టెన్షన్ తప్పదు కదా మరి.

దిల్ రాజు ఆశ తీరింది అంటే మాత్రం ముందుగా అందించే వాళ్ళు మన ప్రభాస్ ఫ్యాన్స్ . అంత కష్టపడి లెక్కలు వేసి సినిమా తీస్తే ఇంకా అది హిట్ బొమ్మే అవుతదని అసిదాం. 

Tags

follow us

Web Stories