ఫ్యామిలీ ట్రిప్ లో దిల్ రాజు..ప్ర‌యాణాలు ర‌ద్దుచేసిన యూఎస్..!

  • Written By: Last Updated:
ఫ్యామిలీ ట్రిప్ లో దిల్ రాజు..ప్ర‌యాణాలు ర‌ద్దుచేసిన యూఎస్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అమెరికాకు వెళ్లారు. దేశంలో క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ఇత‌ర దేశాల ప్ర‌యాణాన్ని మే 4నుండి నిలిపివేస్తూ యూఎస్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే దానికి ఒక‌రోజు ముందే మే3న దిల్ రాజు ట్రిప్ కు వెళ్లారు. దిల్ రాజు ఫ్యామిలీ తో క‌లిసి ఈ ట్రిప్ కు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఆయ‌న ఇండియాకు తిరిగి వ‌స్తార‌ని సమాచారం. ఇదిలా ఉండ‌గా దిల్ రాజు ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. సినిమాపై క‌రోనా ఎఫెక్ట్ ప‌డిన‌ప్ప‌టికీ థియేట‌ర్ లో న‌డిచిన రోజుల్లో మంచి క‌లెక్ష‌న్లు సాధించింది.

ఇక ఈ సినిమా త‌ర‌వాత దిల్ రాజు త‌మిళ స్టార్ ద‌ర్శుకుడు శంక‌ర్ తో ఓ సినిమాను సెట్ చేసారు. ఈ చిత్రంలో హీరోగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా వ‌చ్చేసింది. ఇదిలా ఉండ‌గానే దిల్ రాజు మ‌రో క్రేజీ ప్రాజ‌క్టును కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో దిల్ రాజు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిచ‌బోతున్న‌ర‌ట‌. ఇప్ప‌టికే వంశీ విజ‌య్ కి క‌థ చెప్పార‌ట‌. ఇక దీనిపై ప్ర‌క‌ట‌న మాత్రమే మిగిలి ఉంద‌ని టాక్.

follow us