రిలీజ్ కు దగ్గరపడుతున్న సమయంలో చిరు – బాలయ్య లకు పెద్ద షాక్ ఇచ్చిన దిల్ రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు అనే అంత చెపుతారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రబ్యూటర్ గా కూడా రాణిస్తుంటారు. ఈ మధ్య ఎందుకో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఈయన నిర్మించిన వారసుడు మూవీ సంక్రాంతి బరిలో దించడం తో చాలామంది రాజు ఫై ఆగ్రహం తో ఉన్నారు. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తమిళ్ సినిమాను రిలీజ్ చేయడం ఏంటి అని ప్రశినిస్తున్నారు. అలాగే థియేటర్స్ విషయంలోనూ ఆగ్రహం గా ఉన్నారు. అయితే మొన్నటి వరకు దిల్ రాజు ఈ వివాదాలపై సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరుకుతాయి, నా మీద కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని , సినిమా బిజినెస్ ఎవరూ కంట్రోల్ చేయలేరు. బాగున్నా సినిమాను జనాలు ఆదరిస్తారు.. బాగాలేకపోతే మొదటి రోజే రిజక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ తీరా ఇప్పుడు సినిమా రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండగా..దిల్ రాజు తన అసలు స్వరూపం బయటపెట్టారని ఇప్పుడు మెగా , నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
తాను నిర్మించిన వారసుడు చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్స్ కేటాయించి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రాలకు మొండిచేయి చూపించారు. సంక్రాంతి చిత్రాల విడుదలకు సమయం దగ్గరబడిన నేపథ్యంలో థియేటర్స్ పంపకాలు మొదలయ్యాయి. చాలావరకు ఎగ్జిబిటర్లు తమ థియేటర్స్ లో ప్రదర్శించే చిత్రాల లిస్ట్ విడుదల చేశారు. ఆంధ్రాలో ప్రధాన నగరాల్లో ఒకటి, వైజాగ్ థియేటర్స్ లో ఆడే సంక్రాంతి చిత్రాల లిస్ట్ విడుదల చేశారు.
అత్యధికంగా 8 స్క్రీన్స్ విజయ్ నటించిన వారసుడు చిత్రానికి చెరో 5 స్క్రీన్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు దక్కాయి. విశాఖ లో అత్యధిక రెవెన్యూ ఇచ్చే సింగిల్ స్క్రీన్స్ సంగం, వారసుడు ఖాతాలోకి వెళ్లిపోయాయి. జగదాంబ, శరత్ మాత్రం వాల్తేరు వీరయ్యకు దక్కాయి. కేవలం లీలా మహల్ వంటి చెప్పుకోదగ్గ ఒక్క థియేటర్ వీరసింహారెడ్డికి దక్కింది. డిస్ట్రిబ్యూషన్ రేషియో పరిశీలిస్తే… వారసుడుకి సగం మిగతా రెండు చిత్రాలకు సగం థియేటర్స్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేషియోలో థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండనుంది. ఈ లెక్కలు చూసి మెగా , నందమూరి అభిమానులు దిల్ రాజు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ ని తొక్కాలని దిల్ రాజు ఇలా చేసాడని అంటున్నారు. తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ కోల్పోతాయి. సినిమా చూడాలకున్నప్పటికీ ప్రేక్షకులకు టికెట్స్ దొరకవు. ఆ ఓవర్ ఫ్లో వారసుడు చిత్రానికి షిఫ్ట్ చేసి దిల్ రాజు లాభపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే ఇలా చేసాడని మాట్లాడుకుంటున్నారు.