మీరు గెలికింది చాలు..ఇప్పుడు మళ్లీ గెలక్కండి – దిల్ రాజు స్వీట్ వార్నింగ్

మీరు గెలికింది చాలు..ఇప్పుడు మళ్లీ గెలక్కండి – దిల్ రాజు స్వీట్ వార్నింగ్

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు అనే అంత చెపుతారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రబ్యూటర్ గా కూడా రాణిస్తుంటారు. ఈ మధ్య ఎందుకో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఈయన నిర్మించిన వారసుడు మూవీ సంక్రాంతి బరిలో దించడం తో చాలామంది రాజు ఫై ఆగ్రహం తో ఉన్నారు. ఇద్దరు అగ్ర సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తమిళ్ సినిమాను రిలీజ్ చేయడం ఏంటి అని ప్రశ్నింస్తున్నారు. అలాగే థియేటర్స్ విషయంలోనూ ఆగ్రహం గా ఉన్నారు. సోషల్ మీడియా లోను ఇదే ప్రస్తావన చాల రోజుల పాటు కొనసాగింది.

తాజాగా దీనిపై మరోసారి దిల్ రాజు ను మీడియా వారు అడుగగా..మీడియా వారికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. శుక్రవారం రోజు దిల్ రాజు మరో ప్రొడక్షన్ హౌసింగ్ ను స్థాపించి ఇందులో బలగం అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక సినిమా లోగో లాంచ్ లో మాట్లాడిన దిల్ రాజు ఇదే విషయంపై మీడియా నుంచి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘మీరు మీడియా వాళ్ళు ఎదో ఒకటి గెలుకుతుంటారు..ఇప్పుడు గెలక్కండి. ఆల్రెడీ గెలికింది చాలు.. ఇప్పుడు బలగం సినిమా గురించి మాత్రమే మాట్లాడుదాం..’ అని దిల్ రాజు సున్నితంగా ఆ విషయంపై స్పందించారు. అందుకు సంబంధించిన కామెంట్స్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

follow us