వరుణ్ తేజ్ తో వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఘని అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై గత కొంతకాలంగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అవుట్ పుట్ పై వరుణ్ తేజ్ సంత్రుప్తిగా లేరని…షూటింగ్ ఎక్కువ కాలం జరుగుతున్న కారణంగా వరుణ్ తేజ్ జిమ్ చేయలేక కష్టపడుతున్నారని అందువల్ల ఆయన దర్శుకుడిపై గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ మధ్య షూటింగ్ సెట్ ను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అయితే తాజాగా ఆ వార్తలపై చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వస్తున్న వార్తలు ఎక్కడ నుండి వస్తున్నాయో నాకు తెలియదు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. షూటింగ్ మొదలైన నాటి నుండి వరుణ్ తేజ్ నాకు మెయిన్ పిల్లర్ లాగా ఉన్నారు. ఇక సెట్ విషయానికి వస్తే కరోనా తో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెట్ ను తొలగించామని చెప్పారు. ఇక దర్శకుడి మాటలతో సినిమా పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.