టాలీవుడ్ లో మరో విషాదం..కరోనాతో దర్శకుడు మృతి.!

director nandhyala ravi died with corona
director nandhyala ravi died with corona

కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో విషాదం నింపింది. కరోనా కాటుకు ఇప్పటికే పలువురు బలికాగా తాజాగా మరో దర్శకుడు బలయ్యారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన రచయిత, దర్శకుడు నంద్యాల రవి ఈరోజు కన్నుమూశారు. కరోనా తో ఆస్పత్రిలో చేరిన రవి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం తో ప్రముఖ కమెడియన్ సప్తగిరి 1 లక్ష ఆర్థిక సహాయం చేసారు.

ఇక ఈరోజు కరోనా తో పోరాడుతూ రవి మరణించడం తో పలువురు సినిప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రవి పశ్చిమ గోదావరి జిల్లా వాసి కాగా సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అంచెలంచెలుగా ఇండస్ట్రీలో దర్శకుడి వరకు వరకూ ఎదిగారు. నేను సీత మహాలక్ష్మి, అసాధ్యుడు, పందెం సినిమాలకు రచయితగా పని చేసిన రవి “లక్ష్మీ రావే మా ఇంటికి” సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతే కాకుండా ఇటీవలే విడుదలైన పవర్ ప్లే సినిమాకు కూడా స్క్రిప్ట్ రైటర్ గా పని చేసాడు.