బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ తో ప్ర‌భాస్ సినిమా.!

director siddharth anandh movie with prabhas
director siddharth anandh movie with prabhas

బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా విజయం తరవాత వరుస పాన్ సినిమా సినిమాలకు ఒకే చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వం లో “రాధే శ్యామ్” సినిమాను పూర్తి చేశారు. ఇదిలా ఉండగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమాను మొదలు పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు సలార్ తో పాటు “ఆది పురుష్” సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఇవి ఇలా ఉండగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక తాజా సమాచారం ప్రకారం…ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ..ప్రభాస్ కు ఒక కథను చెప్పారట. ఇక ఆ కథ నచ్చడంతో ప్రభాస్ ఒకే చెప్పారట. అంతే కాకుండా ఈ చిత్రాన్ని మైత్రీమేకర్స్ పై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని టాక్. ఇక సిద్దార్థ్ ఆనంద్ “వార్, బ్యాంగ్ బ్యాంగ్” లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.