45 కొత్త ఆర్టిస్ట్ లతో తేజా చిత్రం సీక్వెల్

director teja anounces chithram sequel
director teja anounces chithram sequel

కెమెరా మెన్ నుండి దర్శకుడిగా మారిన తేజ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా చిత్రం తో ప్రేక్షకులను అలరించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్, రీమా సేన్ లకు కూడా మంచి హిట్ ఇచ్చాడు. 2000 సంవత్సరం లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. దాంతో తేజ తో పాటు సినిమాలో నటించిన నటీ నటులు ఫుల్ బిజీ అయ్యారు. ఇక ఈ సినిమా తరవాత తేజ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తేజ ఇటీవలే రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా “సీత” సినిమా తీసాడు. ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇక నేడు తేజ బర్త్ డే సందర్భంగా చిత్రం సినిమా సీక్వెల్ తియ్యబోతునట్టు ప్రకటించాడు. సినిమా టైటిల్ ను చిత్రం 1.1 గా అనౌన్స్ చేసాడు. ఈ సినిమాతో 45 కొత్త ముఖాలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి కూడా మొదటి సినిమాకు సంగీతం అందించిన ఆర్పీపట్నాయక్ మ్యూజిక్ ఇవ్వబోతునట్టు ప్రకటించారు.