కరోనా లాక్ డౌన్ : WHO కోర్స్ జాయిన్ అయిన దర్శకుడు తేజ

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యం లో ఖాళీ గా ఉన్న అయిన సినీ ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు టైం ను ఉపయోగిచుకుంటున్నారు. 

వినూత్నం గా ఆలోచించిన దర్శకుడు తేజ WHO కోర్స్ లో జాయిన్ అయ్యాడు. నెల రోజులు ఉండబోయే ఈ కోర్స్ లో అంటూ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి. వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు.. అలానే ప్రభావితం చెందే శరీర భాగాల గురించి తెలుసుకోడానికి కోర్స్ జాయిన్ అయ్యారు.. ఈ కోర్స్ పూర్తి అయ్యాక తేజ WHO నిర్వహించే పరీక్ష కూడా రాయబోతున్నారు.. ఈ కోర్స్ లో కానీ తేజ పాస్ అయితే WHO కు వాలంటీర్ గా పని చేసే అవకాశం దొరుకుతుంది.. 
ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తుంటే.. తేజ మాత్రం అసలు అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి మీద అవగాహన కల్గించుకునే పనిలో ఉన్నారు..