కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్న తేజ..!

టావీవుడ్ క్రేజీ దర్శకుల్లో తేజ ఒకరు. తేజ కొంత కాలం సినిమాలకు దూరమైనా మళ్లీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. అయితే తేజ ఇటీవల తాను తెరకెక్కించిన చిత్రం సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్రం 1.1 పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ బావ మరిది నితిన్ చంద్ర హీరోగా నటిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ చంద్ర ఈ ప్రాజక్టు నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది.
ఈ సినిమాతో తేజ తన కుమారుడు అమితవ్ తేజ ను హీరో పరిచయం చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను ఎప్రిల్ 18న పూజా కార్యక్రమాలు నిర్వహించి మొదలు పెట్టనున్నారు. ఇక ఈ వార్తలు వరకు నిజమో తెలియాలంటే ఎప్రిల్ 18 వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు దర్శకుల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో పూరీ జగన్నాత్ కుమారుడు ఆకాశ్ పూరీ కూడా ఒకరు. ఆకాశ్ తండ్రి టాప్ డైరెక్టర్ అయినా ఇప్పటికీ ఆకాశ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఎంట్రీ ఇస్తే తేజ కుమారిడి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.