స‌ర్కారు వారి పాట‌ టీంలో విషాదం..క‌రోనాతో యంగ్ డైరెక్ట‌ర్ మృతి..!

director vatti kumar dies with corona
director vatti kumar dies with corona

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మరణాల సంఖ్య పెరగటం కూడా ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు ప్రముఖులు కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కరోనా బారిన పడి కన్ను మూశారు. కొద్ధి రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిన దర్శకుడు కుమార్ వట్టి గురువారం చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పరిస్థితి విషమించడంతో ప్లాస్మా థెరపీ చేస్తున్న సమయంలో కుమార్ వట్టి హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.

శ్రీకాకుళం కు చెందిన కుమార్ వట్టి శ్రీవిష్ణు హీరోగా నటించిన “మా అబ్బాయి” సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం కుమార్ సర్కారు వారి పాట సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే తన రెండో సినిమాను ఓ బడా ప్రొడ్యూసర్ తో ఒప్పందం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కుమార్ వట్టి చిన్న వయసులో చనిపోవడం నిజంగా బాధాకరం. ఇక కుమార్ వట్టి మరణం పై పలువురు సెలబ్రెటీలు సంతాపం తెలిపారు.