మరోసారి నిరాశపర్చిన సమంత !

బిగ్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ బుల్లి తెరపై బిగ్ బాస్ తో తానెంటో నిరూపించుకుంది సమంత. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన “ఆహా” తో “సామ్ జామ్” అనే టాక్ షో ని చేస్తుంది. ఈ షో కోసం అల్లు అరవింద్ భారీ వ్యయం తో పబ్లిసిటీ చేశాడు. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి అధ్వర్యంలో ఈ టాక్ షో నడుస్తుంది. మొదటి ఎపిసోడ్ కు “అర్జున్ రెడ్డి” ఫేమ్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. సరదా సరదాగా సాగిన ఆ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించుకుంది.
ఆ తర్వాతి ఎపిసోడ్ కు దగ్గుబాటి హీరో రానా, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ లు వచ్చారు. కానీ ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రొటీన్ గా సాగుతూ వీక్షకులకు సమంత హోస్టింగ్ బోర్ కొట్టిస్తుంది. సామ్ జామ్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రముఖ బ్యాట్ మ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తో.. కానీ ఆ ఎపిసోడ్ కూడా పాత చింతకాయ పచ్చడిలానే కొనసాగింది. భారీ బడ్జెట్ తో ఈ షో ను నిర్వహిస్తున్న అల్లు అరవింద్ కు మాత్రం నిరాశే మిగులుతుంది.. ఈ షో కోసం సమంత భారీ పారితోషికం తీసుకుంటుంది. హిందీలో కరణ్ జోహర్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ టీమ్ ఆహా కోసం పనిచేస్తున్నారు. కానీ ఈ షో లో మాత్రం సమంత మెరుపులు లేవు. పైగా ఆమె వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ… ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. ఈ టాక్ షో ఎక్కువ భాగం ఇంగ్లిష్ లోనే కొనసాగుతుంది. సామ్ జామ్ కు సమంత హోస్టింగ్ ఓ పెద్ద మైనస్ గా మారింది.