కెజిఎఫ్ సిరీస్ తో కైకాల ఎంత సంపాదించాడో తెలుసా..?

చిత్రసీమ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈరోజు శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం కన్నుమూశారు. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న సత్యనారాయణ..నవరసాలను పండించే నటుడిగా, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర లేదు. సాంఘిక, పౌరాణిక,జానపద, సోషియో ఫాంటసీ, కామెడీ, హారర్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేసి మెప్పించాడు.
కాగా కైకాలకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు..అయితే ఆయన నట వారసత్వాన్ని వారు కొనసాగించలేకపోయారు. కొడుకులిద్దరికి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి లేకపోవడం వల్లే ఇండస్ట్రీ కి రాలేదు..వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తున్నారని, కైకాల సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ లో అప్పట్లో తెలిపాడు..కానీ పెద్ద కుమారుడు కైకాల లక్ష్మి నారాయణ మాత్రం సినీ రంగం లోకి ఈమధ్యనే అడుగుపెట్టాడు. కన్నడలో సంచలన విజయం సాధించిన KGF సిరీస్ కి లక్ష్మి నారాయణ సహా నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగు లో రెండు భాగాలను ఆయనే స్వయంగా విడుదల చేసాడు. ఈ రెండుకూడా వంద కోట్ల రూపాయలలో లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ సినిమా టైటిల్స్ పడేముందు ‘కైకాల సత్యనారాయణ సమర్పించు’ అని పడడం మనం గమనించే ఉంటాము. ఈ సినిమా ద్వారా సుమారుగా 170 కోట్ల లాభాలు సత్యనారాయణ కుమారుడికి వచ్చినట్టు తెలుస్తుంది.