ఊర్మిళ అంత మాట అనేసింది ఏంటి ?

  • Written By: Last Updated:
ఊర్మిళ అంత మాట అనేసింది ఏంటి ?

ఇటీవలే ప్రముఖ నటి ఊర్మిళ మాటోండ్కర్ ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేసే రాజకీయనేతగా ఉండడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

తాను ప్రజల అభిమానంతోనే సినీ నటిగా ఎదిగానని, ఆ కోవలోనే ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నానని వివరించారు. అందుకే శివసేన పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. కులం, మతం పట్టించుకోనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఊర్మిళ చెప్పుకొచ్చారు.

శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏడాది కాలంగా బాగా పనిచేస్తుందని చెప్పారు. కొవిడ్-19తో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఉద్ధవ్ సర్కారు సమర్ధంగా ఎదుర్కొందని ఉర్మిళా వివరించారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా శివసేన కోసం కృషి చేస్తానని ఉర్మిళా మటోండ్కర్ వివరించారు.

follow us