ట్రెండింగ్ లో డ్ర‌గ్స్ క్వీన్ మ‌హేష్ బాబు..ఏంద‌య్యా ఈ ర‌చ్చ‌.?

DrugsQueenMaheshbabu trending on twitter
DrugsQueenMaheshbabu trending on twitter

టాలీవుడ్ హీరోల అభిమానుల మధ్య వార లు ఏమీ కొత్త కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఎప్పుడూ ఏదో ఒక వార్ నడుస్తూనే ఉంటుంది. ఒక హీరో సినిమా మరో మరో హీరో అభిమానులు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. కానీ తాజాగా మాత్రం బన్నీ అభిమానులు. మహేష్ బాబు పై ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. #drugsqueenmaheshbabu అనే హాష్ టాగ్ తో ట్రెండింగ్ లోకి సైతం తీసుజువచ్చారు. అసలు బన్నీ, మహేష్ బాబు అభిమానుల మధ్య ఈ వార్ ఎందుకు మొదలయ్యింది. అన్నది మాత్రం అర్ధం కావడం లేదు.

కానీ మహేష్ బాబు ఫోటోలను, వీడియోలను ఫన్నీగా మార్ఫింగ్ చేస్తూ ట్విట్టర్ లో పెడుతున్నారు. దాంతో డ్రగ్స్ క్వీన్ మహేష్ బాబు పేరుతో హాష్ టాగ్ దేశ దేశవ్యాప్తంగా టాప్ 3 ట్రెండింగ్ లో ఉంది. ఇక తమ హీరోపై ట్రోల్స్ చేస్తే మహేష్ బాబు అభిమానులు ఊరుకుంటారా.? వాళ్ళు కూడా తిరిగి కామెంట్స్ రూపంలో దాడి చేస్తున్నారు. హీరోలు అనేక సందర్భాల్లో తాము కలిసే ఉంటామని చెబుతున్నా.? ఫ్యాన్స్ ఎందుకు ఇలా చేతారన్నది మాత్రం ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంటుంది.