డ్రగ్స్ కేసులో భాగంగా రకుల్ ప్రీతీ సింగ్ కు ఈడీ నోటీసులు

డ్రగ్స్ కేసులో భాగంగా రకుల్ ప్రీతీ సింగ్ కు ఈడీ నోటీసులు

నటి రకుల్ ప్రీతీ సింగ్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఈడీ రకుల్ కు నోటీసులు అందజేశారు. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇందులో పలువురు సినీ తారల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి. వారికి గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోసారి ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది.

గతంలోనే ఈడీ రకుల్ ను విచారించడం జరిగింది.అయితే ఆమె విచారణ మధ్యలోనే వెళ్ళిపోయింది. దీంతో మరోసారి ఆమెను విచారించబోతుంది ఈడీ. ఇదే కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీల పై రోహిత్ కు నోటీసులిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనను కూడా ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మందికి ఈడీ నోటీలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరణ్, నవదీప్, పబ్ మేనేజర్ మొదలైన వారు ఉన్నారు.

follow us