ఒక ట్వీట్ తో లక్ష కోట్ల నష్టం , సీఈఓ గా రాజీనామా చేయబోతున్నాడా ? 

ఒక ట్వీట్ తో లక్ష కోట్ల నష్టం , సీఈఓ గా రాజీనామా చేయబోతున్నాడా ? 
టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్,  ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు..  కార్ ప్రేమికులకు టెస్లా కార్ కొనడం ఒక డ్రీం.. అలాంటి టెస్లా షేర్ వాల్యూ కి ఒక ట్వీట్ తో లక్ష కోట్ల నష్టం తెచ్చారు.

ఎలన్ మాస్క్ టెస్లా షేర్ వాల్యూ హై లో ఉందంటూ ఒక ట్వీట్ చేసాడు.. ఈ ట్వీట్ తో అమెరికన్ షేర్ మార్కెట్ లో అలజడి రేగింది..అప్పటి వరకు 141 బిలియన్ డాలర్స్ ఉన్న టెస్లా మార్కెట్ షేర్ వాల్యూ ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే 127 బిలియన్ డాలర్స్ కు పడిపోయింది. ఇలా ట్వీట్ చేస్తే నిబంధనాలు ఉల్లంగించినట్టే. ఎలన్ మాస్క్ ఈ టెస్లా కంపెనీ లో వాటా దారుడు.

ఒక సంస్థాకు చెందిన షేర్ పెరిగిన , అమ్మిన అసలు షేర్ గురించి బహిరంగంగా మాట్లాడాలి అంటే ముందే పర్మిషన్ తీసుకోవాలి.

ఎలన్ మాస్క్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ట్వీట్ చేయడంతో మార్కెట్ లో గందర గోళం ఏర్పడి , షేర్ వాల్యూ పడిపోయింది. వీటి అన్నిటికి ఆ ట్వీట్ కారణం అవ్వడంతో అమెరికా సెక్యూరిటీస్ ఎలన్ మాస్క్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అలానే టెస్లా సంస్థా సీఈఓ పదవి నుంచి కూడా తొలగించే అవకాశం ఉంది.

మొత్తానికి ఒక ట్వీట్ ఎలన్ మాస్క్ కొంప ముంచింది అనే చెప్పాలి.