Exclusive : బ‌చ్చిబాబు సినిమాలో ఎన్టీఆర్ కు అంగ‌వైక‌ల్యం.!

exclusive news on ntr bucchibabu cinema
exclusive news on ntr bucchibabu cinema

దర్శకుడు బుచ్చి బాబు సన మొదటి సినిమా ఉప్పెన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాక్ డౌన్ తరవాత విడుదలైన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరవాత బుచ్చిబాబు తన తదుపరి సినిమాను కూడా మైత్రీమూవీ మేకర్స్ తోనే తీయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతే కాకుండా బుచ్చిబాబు ఏ హీరోతో అంటే ఆ హీరో డేట్స్ ఇస్తామని చెప్పారట. ఈ నేపథ్యంలో బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా ఇద్దరి కాంబినేషన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కబోతుందని గుసగుసలు వినిపించాయి. అంతే కాకుండా ఇప్పటికే ఎన్టీఆర్ కు బుచ్చిబాబు కథ చెప్పారని…ఎన్టీఆర్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొన్ని మార్పులు చేయమన్నారని గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వైకల్యం గల వ్యక్తిగా కనిపించబోతున్నాడట. సినిమాలో ఎన్టీఆర్ కు ఒకే కాలు ఉంటుందట. అంటే ఒంటి కాలుతో పోరాటం చేసేవ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.